India: టీం ఇండియాకు షాక్.. 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు ఊహించని షాక్ తగిలింది. తొలి మ్యాచ్ కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి బయలుదేరాడు. మోర్కెల్ తండ్రి ఆల్బర్ట్ మరణించడంతో అతను సౌతాఫ్రికా వెళ్లాల్సి వచ్చిందట. సోమవారం (ఫిబ్రవరి 17) జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు మోర్కెల్ దూరమయ్యాడు. మోర్కెల్ తిరిగి జట్టులోకి ఎప్పుడు చేరాతాడో స్పష్టత లేదు. బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో టీమిండియా బౌలింగ్ బలహీనంగా మారింది. గాయం నుంచి కోలుకున్న షమీ ఎంతవరకు రాణిస్తాడనేది అనుమానంగా మారింది.